Site icon NTV Telugu

Vijayasai Reddy: భయం అనేది నా రక్తంలో లేదు.. పార్టీని విడటంపై విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Vijayasaireddy

Vijayasaireddy

Vijayasai Reddy: వైసీపీకి రాజీనామా చేయటంపై మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉంది.. దాని వల్లే నేను జగన్ కు దూరం అయ్యాను.. ఆయన మనసులో నాకు స్థానం లేదు అని తెలిసింది.. ఆ విషయం తెలిసి నా మనసు విరిగింది.. అందుకే పార్టీ నుంచి వెళ్లి పోతున్నాను అని నేను జగన్ కు చెప్పాను.. కోటరీ నుంచి జగన్ బయట పడాలి.. అప్పుడే జగన్ కు భవిష్యత్ ఉంటుంది.. కొందరు నేతలు జగన్ చుట్టూ కోటరీ గా ఏర్పడ్డారు అని ఆయన పేర్కొన్నారు. జగన్ ను ఎవరికైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుంది.. నాయకుడు ఈ చెప్పుడు మాటలు నమ్మకూడదు.. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ, ప్రజలు నష్టపోతారు అని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కాంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర దారి అని విజయ సాయిరెడ్డి తెలిపారు.

Read Also: Kakani Govardhan Reddy: నిరుద్యోగ భృతి ఊసేలేదు.. తల్లికి వందనంను ఎగ్గొట్టారు!

ఇక, నాకు భయం అంటే తెలీదు అని మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి తెలిపారు. నేను అనేక అవమానాలు కష్టాలు వైసీపీలో పడ్డాను.. నాకు అనేక పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేక వెళ్ళిపోయాను.. నేను ప్రలోభాలకు లొంగాను, భయపడ్డాను అని అన్నారు.. అవేం జరగలేదు.. మా నాయకుడిలోనే మార్పు వచ్చింది.. ఒకప్పుడు మా నాయకుడు అంటే భక్తి ఉండేది.. కానీ, ఇప్పుడు అది దేవుడి మీదకు వెళ్ళింది అని పేర్కొన్నారు.

Exit mobile version