ఏపీ రాజకీయాలు బీజేపీ నేత సోమువీర్రాజు లిక్కర్ గురించి మాట్లాడిన మాటలపై నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒక హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని బహిరంగగానే విమర్శిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి దీనిపై తనదైన స్టైల్‌లో విమర్శల బాణాలు సంధించారు.
Read Also: చెప్పులపై జీఎస్టీ వేయడమేంటి..?: నారాయణ
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ర్టంలో వేరే పార్టీలను ఆదరించే పరిస్థితి లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ గారి సంక్షేమ పథకాలతో ప్రజలు వేరే పార్టీలను ఆదరించే పరిస్థితి లేదు. కొత్తగా ఏం చేయొచ్చో పాలుపోక ‘చీప్ లిక్కర్’ పారిస్తామంటూ చౌకబాబు ప్రకటనలు గుప్పిస్తున్నారు. లిక్కర్ బ్రాండ్ల గురించి వాపోతారు. మరో పక్క అప్పులు తెచ్చి వెల్ఫేర్ స్కీములు నడపడమేమిటని విమర్శించేది వీళ్లే. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
