Site icon NTV Telugu

VijayasaiReddy: టీడీపీ పనైపోయింది.. చంద్రబాబే తేల్చేశాడు.. వీడియో పోస్ట్ చేసిన వైసీపీ ఎంపీ

Vijaysaireddy

Vijaysaireddy

VijayaSaireddy: టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా సోషల్ మీడియాలో మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా మొన్న అచ్చన్న.. నిన్న స్వయంగా చంద్రబాబే ‘పార్టీ లేదు-బొక్కాలేదు’ అన్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రోజురోజుకూ టీడీపీ నిర్వీర్యం అయిపోతోందని చంద్రం అన్నయ్యే తేల్చేశాడని చురకలు అంటించారు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా.. పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీకి 2024 చివరి ఎన్నికలు అని.. తమ్ముళ్లూ సర్దుకోవాలని హితవు పలికారు.

దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజున కూడా విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. ‘నీకు పార్లమెంట్లో పనుందా? “రొచ్చుబండ” పెట్టలేకపోతున్నావా? పార్లమెంట్లో నీకు ఓనామాలైనా వచ్చా విగ్గురాజు? ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిధిలోనే అప్పులు చేస్తుందిరా గబ్బు! ఆ విగ్గు తీసి ఆలోచించు. కనీసం బుర్రకేమైనా ఎక్కుతుందేమో’ అంటూ మరో ట్వీట్‌ చేశారు.

Exit mobile version