NTV Telugu Site icon

Vijay Sai Reddy: నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు

Vsai 1

Vsai 1

ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీ తరఫున మరోసారి అవకాశం దక్కించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నాలుగు స్థానాల్లో విజయసాయిరెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీవీతో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నా పై అచంచల విశ్వాసం ఉంచి రాజ్యసభకు మరోసారి పంపిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు జగన్, భారతి లకు ధన్యవాదాలు తెలిపారు.

నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తా. రాష్ట్ర, పార్టీ, కుటుంబ ప్రయోజనాలను కాపాడతాను. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. ఒక ఆడిటర్ గా నా ప్రస్థానం ప్రారంభమైంది. నాకు ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యత లను సక్రమంగా నిర్విర్తించటమే నా విధి. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. బీసీలకు కీలక ప్రాధాన్యత ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నారు.

జూన్ 22 నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 9కి పెరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలెక్ట్రోరల్ కాలేజీలో బీజేపీ కి 4 శాతం బలం తక్కువగా ఉంది. వైసీపీ మద్దతు ఇస్తే మరో పార్టీ సహకారం అవసరం ఉండదు. పార్లమెంటులో వైసీపీది కీలక పాత్ర కానుందన్నారు విజయసాయిరెడ్డి. వైసీపీలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని రెండవ సారి ఎంపీ కావడంతో నిరూపణ అయిందని ఆయన వర్గీయులు అంటున్నారు.

Vijay Sai Reddy: చిదంబరాన్ని అరెస్ట్ చేయాలి.. ఎంపీ హాట్ కామెంట్స్