NTV Telugu Site icon

Vidadala Rajini: రాబోయే ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేస్తాం

Vidadala Rajini

Vidadala Rajini

విశాఖలో జరిగిన వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తల ధైర్యం సీఎం జగన్మోహన్‌రెడ్డేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేస్తామని.. విశాఖను తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ఆమె వివరించారు. గతంలో విశాఖ ఎలా ఉందో. ఇప్పుడు విశాఖ ఎలా ఉందో ప్రజలు గమనించాలని సూచించారు.

వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే వైసీపీ కార్యకర్తలు ప్రచారం మొదలు పెట్టాలని మంత్రి విడదల రజినీ వ్యాఖ్యానించారు. అందులో భాగంగా ఈనెల 11 నుంచి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గడపలో ఎన్ని సంక్షేమ పథకాలు చేరాయో వైసీపీ కార్యకర్తలందరూ ప్రజలకు తెలియజేయాలన్నారు. అటు ఏపీలో రూ.1600 కోట్లతో ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేశామని మంత్రి విడదల రజినీ తెలిపారు. మహిళలకు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మంత్రి వర్గంలో బీసీ, మైనారిటీలకు 11 పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన కార్యకర్తలను తాము తప్పకుండా గౌరవిస్తామని మంత్రి రజినీ స్పష్టం చేశారు.

Andhra Pradesh: ఈ ఆర్టీసీ డ్రైవర్ ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..!!

 

Show comments