NTV Telugu Site icon

Vidadala Rajini: విశాఖ జిల్లా అంటే సీఎం జగన్‌కు ప్రత్యేక అభిమానం

Vidadala Rajini

Vidadala Rajini

విశాఖ జిల్లా సమీక్షా సమావేశంలో ఇంఛార్జి మంత్రి, వైద్యశాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమీక్షా సమావేశంలో 9 అంశాలపై చర్చ జరిగిందన్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రోడ్లు, టూరిజం, నగర అభివృద్ధి, పారిశుధ్యం, వీధి లైట్లు, ఆరోగ్యం, నాడు-నేడు పనులపై సమీక్ష జరిగిందని తెలిపారు. విశాఖ జిల్లా అంటే సీఎం జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం అని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. ఎక్కడ జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయని చెప్పారు. రానున్న కాలంలో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం జగన్ చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలు కూడా అమలు చేశారని తెలిపారు.

విశాఖ జిల్లా సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. పదే పదే రుషికొండపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి కోసం కొండలు చదును చేశారని.. చంద్రబాబు హయాంలో కొండలు చదును చేస్తే అభివృద్ధి.. జగన్మోహన్ రెడ్డి హయాంలో చదును చేస్తే విధ్వంసంమా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలని, ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ రాజధాని కాకూడదా అని నిలదీశారు. విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కోర్టుకు వెళ్లారని.. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు.

Chandrababu: రాష్ట్రంలో సైకో పాలన.. పిచ్చోడి చేతిలో రాయిలా పరిస్థితి..!

Show comments