తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని పిలుపునిచ్చారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. విశాఖలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటుకునేందుకు సంఘటితంగా ముందు సాగుదామన్నారు.. మన భాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడంతో పాటు ఇతరుల భాషా సంస్కృతులను గౌరవించాలన్నారు.. మనుషులనే గాక, తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్నారు. ఆచార వ్యవహారాలు, భాష సంస్కృతులను పునరుజ్జీవింపజేసుకోవాలన్న ఆయన.. తెలుగు సమాజ నిర్మాణం కోసం రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.. ఇతర భాషల్లోకి తెలుగు సాహిత్యాన్ని అనువదించడం మీద ప్రభుత్వాలు, భాషా సంస్థలు చొరవ తీసుకోవాలని.. భాషతో, సాంకేతికతను అనుసంధానం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా మారాలి..

Venkaiah Naidu