NTV Telugu Site icon

Venugopala Krishna: అక్కడ వైసీపీలో అసమ్మతి లేదు.. మంత్రి వేణుగోపాల్ క్లారిటీ

Venugopal Ramachandrapuram

Venugopal Ramachandrapuram

Venugopala Krishna Gives Clarity On Ramachandrapuram Issue: రామచంద్రపురం వైసీపీలో గ్రూపు రాజకీయాలపై మంత్రి వేణుగోపాల కృష్ణ తాజాగా స్పందించారు. రామచంద్రపురం వైసీపీలో అసమ్మతి లేదని స్పష్టతనిచ్చారు. అక్కడ పరిణామాలకు కృష్ణార్పణం అనేదే తన సమాధానమని తెలిపారు. రామచంద్రపురం నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆ విషయం స్వయంగా సీఎం జగనే చెప్పారని వెల్లడించారు. సుభాష్ చంద్రబోస్ తనకు గురువు అని పేర్కొన్నారు. తాను జగన్ ప్రతినిధినని, జగన్ గెలుపే తన గెలుపని, ఆ దిశగానే తాను అడుగులు వేస్తానని చెప్పుకొచ్చారు.

Preeti Jhangiani : ఆ కారణంగానే నేను సినిమాలకు దూరం అయ్యాను.

ఇదిలావుండగా.. కొంతకాలం నుంచి మంత్రి వేణుగోపాల్, రాజ్యసభ ఎంపీ పిల్లీ సుభాష్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తన సొంత స్థానమైన రామచంద్రపురం సీటుని తన తనయుడికి ఇప్పించాలని బోస్ ప్రయత్నిస్తుండగా.. మంత్రి వేణు కూడా ఆ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే మంత్రి వేణుకి వ్యతిరేకంగా ఆదివారం ఉదయం రామచంద్రపురంలో వైసీపీ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వైసీపీ కార్యకర్తలపై ఆయన అక్రమ కేసులు బనాయిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వేణుకు టికెట్ ఇవ్వకుండా.. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్య ప్రకాష్‌కు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి డిమాండ్ చేశారు.

Congress On UCC : అన్ని చట్టాల్లో ఏకరూపత అవసరం లేదు : కాంగ్రెస్

ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో.. పార్టీ నేతలందరూ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి వేణు, ఎంపీ పిల్లీ సుభాష్ వర్గాల మధ్య పోరు నెలకొంది. అయితే.. రామచంద్రపురం వైసీపీలో అసమ్మతి ఏమాత్రం లేదని తాజాగా మంత్రి వేణు స్పష్టం చేశారు. తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పేశారు. మరి, ఈ వ్యవహారం ఇక్కడితో తేలిపోయినట్టేనా? లేదా? అన్నది చూడాలి.