Preeti Jhangiani : ఆ కారణంగానే నేను సినిమాలకు దూరం అయ్యాను.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రీతి జింగానియా ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ తెలుగు లో పవన్ కళ్యాణ్ సరసన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రీతీ అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తరువాత బాలకృష్ణ సరసన నరసింహనాయుడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.కానీ ఆ తరువాత ప్రీతి జింగానియా నటించిన తెలుగు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఈ భామకు అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో సరిగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. తర్వాత మళ్ళీ ఒకసారి తేజం అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో నటించింది.2007లో వచ్చిన విక్టోరియా నెం. 203 సినిమా తర్వాత మరే హిందీ సినిమాలోనూ ఈ భామ కనిపించలేదు.సినిమాలకు దూరంగా వున్న ఈ భామ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఫాస్ వెబ్ సిరీస్‌తో ఈ భామ రీఎంట్రీ ఇచ్చింది.ఇటీవల ప్రీతీ తాను సినిమాలకు దూరం అవడానికి కారణం ఏంటో తెలిపింది.
ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ.. నేను కోరుకున్న పాత్రలు నాకు రాలేదు.. నాకు వచ్చిన పాత్రలతో నాకు అంతగా సంతోషంగా అనిపించలేదు. నాకు సినిమాలో ముఖ్యమైన పాత్ర చేయాలని ఉండేది. అలా అని సినిమా మొత్తం నేనే హైలైట్ అవ్వాలని అయితే చెప్పడం లేదు.కనీసం కథలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని అంటున్నాను. అదే నేను కోరుకుంది. కానీ అటువంటి పాత్రలు నాకు రాలేదు. అలాంటప్పుడు నా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని సినిమాలకు దూరం అయ్యాను.హిందీ సినిమాలలో నటించడం మానేసాను కానీ పలు ప్రాంతీయ భాషల్లో నటించాను. ఈవెంట్లు మరియు షోస్ ఇలా ఎన్నో చేశాను. కాబట్టి సినిమాలకు నేను దూరంగా ఉన్నాననే ఫీలింగ్ కలుగ లేదు.కాకపోతే బాలీవుడ్ చిత్రాల్లో నటించడాన్ని బాగా మిస్ అయ్యాను. కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
Also Read
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!