Site icon NTV Telugu

ఆనందయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలి.. గవర్నర్‌కు వినతి

Anandayya

Anandayya

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న సమయంలో.. ఆయుర్వేద మందు తయారీ చేసి వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య… ఆయన మందు కొంతకాలం ఆగిపోవడం, కోర్టు వరకు వ్యవహారం వెళ్లడంతో చాలా రోజులు ఆయన వార్తలు ఆసక్తికరంగా మారాయి.. మొత్తానికి ఏపీ సర్కార్‌ అనుమతి ఇవ్వడంతో.. మంది పంపిణీ మొదలు పెట్టారాయన. ఈ సమయంలో ఆనందయ్యకు చాలా మంది మద్దతుగా నిలిచారు.. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది ఓ సంస్థ.. కరోనా రోగులకు ఆయుర్వేద వైద్యంతో చికిత్స చేస్తోన్న ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కోరింది వెన్నెల ఫౌండేషన్‌.. ఇక, తమ వద్దకు వచ్చిన వినతిని పరిశీలించాలని సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాసింది గవర్నర్ కార్యాలయం.. తన వద్దకు వచ్చిన వినతిని ప్రభుత్వానికి పంపాలని.. గవర్నర్ ఆదేశాల మేరకు సీఎస్‌కు లేఖ రాశారు గవర్నర్ సెక్రటరీ.. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version