భారత భాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఉప రాష్ట్రపతి అయిన సమయంలో ఆయన అనుభవించిన బాధను పంచుకున్నారు.. ఉపరాష్ట్రపతి అయిన సందర్భంలో తాను పార్టీ (భారతీయ జనతా పార్టీ)ని వీడినందుకు చాలా బాధపడ్డానని గుర్తుచేసుకున్నారు… చిన్నప్పుడు తల్లి ప్రేమకు నోచుకోలేదు.. చిన్నప్పుడే తల్లి మరణించడంతో అమ్మమ్మ పెంచింది.. నన్ను పార్టీయే ఇంత వాడిని చేసింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు..
Read Also: Katrina Kaif: అసలు నాకు విక్కీ ఎవరో కూడా తెలియదు.. అంతా నా విధి
రాజానగరంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో సుమారు 500 మిత్రులను, రాజకీయ ప్రముఖులను కలుసుకున్నారు వెంకయ్యనాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. మాతృభాషను మరవొద్దన్ని విజ్ఞప్తి చేసిన ఆయన.. ఎన్ని భాషలు నేర్చుకున్నా వాటితోపాటు మాతృభాష నేర్చుకోవాలని సూచించారు.. మాతృభాష తల్లి లాంటిది.. మాతృభాషను మరిస్తే తల్లిని మర్చిపోయినట్టే అని వ్యాఖ్యానించారు.. కాగా, పరభాషా వ్యామోహం కరోనా కంటే ప్రమాదకరమంటూ గతంలో వ్యాఖ్యానించారు వెంకయ్య.. ఇంగ్లీష్ పై మోజు వద్దని.. ఒకవేళ పరాయి భాష నేర్చుకున్నా తెలుగును మరవొద్దని చెప్పారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి.. కానీ, అమ్మ బాషను మరవద్దని చెప్పారు. మాతృ బాషా, మాతృ భూమిని గౌరవించాలని తెలిపిన ఆయన.. బాషా గొప్పతనం తెలువాలంటే.. మన భాషా సాహిత్యలు ఇతర భాషలో ఆణువదించబడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రమంత్రిగా, పార్టీలో సీరియన్ లీడర్‌గా ఉన్న వెంకయ్యను.. పార్టీ అధిష్టానం.. ఉపరాష్ట్రపతిగా పెట్టాలని నిర్ణయించిన సందర్భంలో ఆయన అనుభవించిన బాధను ఇప్పుడు పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.