టీడీపీ నాయకుల మీద కంట్రోల్ లేదని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. 14 ఏళ్ల చిన్న పాప లైంగిక వేధింపులకు గురైందని, మేడ మీద నుంచే దూకే ముందు అటు ఇటు తిరిగింగిందని వాసిరెడ్డ పద్మ ఆరోపించారు. ఆ బాలిక మరణం తప్ప గత్యంతరం లేదని దూకి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. దీనికి కారణమైన వినోద్ జైన్ ను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ అందరికీ తెలుసునన్నారు. టీడీపీ తరపున కార్పొరరేటర్‌గా పోటీ చేశాడు. ఇవాళ కొత్తగా గుర్తొచ్చినట్టు అతన్ని టీడీపీ బహిష్కరించిందని వాసిరెడ్డి పద్మ అన్నారు.
Read Also: చిన్నారి ఆత్మహత్యపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: వెల్లంపల్లి శ్రీనివాస్
బాలికను ఒంటరిగా ఉన్న సమయంలో వేధించడంతో భయపడింది. ఫిర్యాదు చేసిన వినోద్ రాజకీయ ప్రాబల్యం వల్ల న్యాయం జరగదేమో అని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. చాలామంది దొంగల మధ్యలో వినోద్ జైన్ ఒక దొరికిన దొంగ అని వాసిరెడ్డి పద్మ అభివర్ణించారు. ఆరు నెలలకోసారి వచ్చి టీడీపీ నాయకురాలు అనిత అరుస్తుందని మండి పడ్డారు. మీ బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబులతో క్షమాపణ చెప్పి బయటకు రావాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. బాలకృష్ణకు అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయించుకోవాలంటారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీడీపీ నాయకుల మీద ఆ పార్టీ అధ్యక్షుడికి కంట్రోల్ లేదన్నారు. సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందారు. వినోద్ ను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని వాసిరెడ్డి పద్మ అన్నారు.
