NTV Telugu Site icon

Vasireddy Padma: బాధితురాలి దగ్గర బలప్రదర్శన..! పరామర్శ అంటే ఏంటో టీడీపీ చెప్పాలి..!

Vasireddy Padma

Vasireddy Padma

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార బాధితురాలి పరామర్శ ఇప్పుడు పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తోంది.. పరామర్శ సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం రచ్చగా మారింది.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు మహిళా కమిషన్‌ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. బాధితురాలి దగ్గర టీడీపీ నేతలు బల ప్రదర్శన చేశారని ఎద్దేవా చేసిన ఆమె.. గొడవను కంట్రోల్ చేయమని అడిగితే నాపై విరుచుకుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.. మహిళా చైర్‌పర్సన్‌గా నాకే గౌరవం ఇవ్వకపోతే.. ఇక, మహిళా లోకానికి ఏం సమాధానం చెబుతారు అని నిలదీశారు..

Read Also: Dharmana Krishna Das: ఎవరైనా డబ్బు, పేరు కోసం రాజకీయాల్లోకి వస్తారు.. కానీ, జగన్‌..!

మరోవైపు ఆస్పత్రిలో జరిగిన గొడవకు వివరణ కోరుతూ సమన్లు పంపితే దాన్ని కూడా రాద్దాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ.. మహిళలపై ఉన్న చిన్న చూపే మహిళా కమిషన్‌ను అగౌరవ పరచడానికి కారణమైందన్న ఆమె… మాట్లాడటానికి వీలు లేదు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించి.. వేలు పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.. నా మాట వినండి అనటంతోనే చంద్రబాబు అసహనానికి గురయ్యారు.. బాధితురాలి దగ్గర రాజకీయం చేసి దొమ్మి సృష్టించారని మండిపడ్డారు.. మహిళా కమిషన్‌ను కించపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.. అసలు పరామర్శ అంటే ఏంటో టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు వాసిరెడ్డి పద్మ.