NTV Telugu Site icon

Varupula Raja: గుండెపోటుతో వరుపుల రాజా మృతి.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

Varupula Raja

Varupula Raja

Varupula Raja Died With Heart Stroke: టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వరుపుల రాజా హఠాన్మరణం చెందారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ వరుపుల రాజా మృతి చెందారు. ఆయన పార్ధివదేహాన్ని స్వస్థలం ప్రత్తిపాడుకు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత పెద్ద శంకర్లపూడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. వరుపుల రాజా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటని చెప్పిన చంద్రబాబు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెప్తున్నారు.

Rahul Gandhi: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు.. బీబీసీ విషయంలో ఇదే జరిగింది..

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వరుపుల రాజా.. ఎమ్మెల్సీ ఎన్నికలలో సాలూరు, బొబ్బిలి పార్టీ అబ్జర్వర్‌గా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. సాయంత్రం వీకెండ్ కావడంతో ప్రత్తిపాడు వచ్చారు. పార్టీ నేతలను కలుసుకుని, కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలోనే తనకు సడెన్‌గా గుండెనొప్పి వస్తోందని అన్నారు. దీంతో.. ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే ఆయన మృతి చెందారు. వరుపుల రాజా తాత జోగిరాజు, చిన తాత సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యేలుగా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుపుల రాజా ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా, ఎంపీపీగా, టీడీపీ ప్రభుత్వంలో ఆప్కాబ్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. 2019లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటిస్తుందని ఆశిద్దాం..