Site icon NTV Telugu

వల్లభనేని వంశీ క్షమాపణలపై వంగలపూడి అనిత కౌంటర్‌…!

అమరావతి : వైసీపీ నేతలపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్‌ అయ్యారు. వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పినట్లు మేం భావించడం లేదని… చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ క్షమాపణలు నమ్మలేమని మండిపడ్డారు. మాకు వంశీ సారీ కాదు.. చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వంశీ ఇటు సారీ అంటారు.. కొడాలి మళ్ళీ మీదే తప్పు అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత.

వంశీ 5 శాతమే తప్పు చేశారని కొడాలి అనడాన్ని ఎలా చూడాలి…? అని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రలో మహిళలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని… పాదయాత్రలో రైతులను భోజనం కూడా చేయనీయడం లేదని నిప్పులు చెరిగారు. మహిళ టాయిలెట్లు కూడా తొలగించి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. టాయిలెట్లు కూడా తీసేస్తే మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించరని నిలదీశారు వంగలపూడి అనిత.

Exit mobile version