మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు..? ఇప్పుడే రాజీనామా చేస్తున్నానంటూ ఎన్టీవీ ఇంటర్వ్యూలో సవాల్ విసిరారు.. అంతేకాదు.. ఖాళీ లెటర్ హెడ్‌పై సంతకం చేసి ఇచ్చారు.. తాను రాజీనామా చేస్తున్నట్టు రాసి స్పీకర్‌కు పంపాలని పరిటాల సునీతకు సూచించారు.. తాను పరిటాల సునీతను వదినగానే చూస్తాన్న వంశీ.. కానీ, తల్లికి, గర్బస్థ శిశువుకు మధ్య గొడవలు పెట్టగలిగినంత తెలివైన వాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే సునీత చదివి ఉంటుందని.. గవ్నవరానికో.. గుడివాడకో.. నేనూ, కొడాలి నాని మొదలు కాదు.. చివర కాదన్నారు.
ఇక, చంద్రబాబు భ్రమలు కల్పించి మాట్లాడిస్తారని కామెంట్ చేసిన వల్లభనేని.. తెలంగాణ సీఎం కేసీఆర్ సన్నిహితులతో ఆయన్ను తిట్టించారు చంద్రబాబు అని విమర్శించారు.. కేసీఆర్ తాగుబోతని.. విమర్శలు చేయండని చంద్రబాబు ప్రేరేపించారన్నారు. మరోవైపు, పరిటాల రవిని చంద్రబాబు ఎంత దూరం పెట్టారో అనంతపురం జిల్లాలో అందరికీ తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వల్లభనేని.. పయ్యావులను, నిమ్మల కిష్టప్ప, ప్రభాకర్ చౌదరి వంటి వారితో పరిటాల రవిని తిట్టించారని విమర్శించిన ఆయన.. అప్పటి వరకు వారంతా పరిటాల రవితో సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. మరోవైపు.. కొడెలను వర్ల రామయ్యతో తిట్టించారని ఆరోపించిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే.. కొడెలకు పార్టీకి సంబంధం లేదని వర్ల రామయ్యతో చెప్పించారని.. పరిటాల రవి చనిపోవడానికి.. కోడెల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే అని సంచలన ఆరోపణలు చేశారు.
పరిటాల రవి చనిపోవడానికి తాను కారణం కాదని చంద్రబాబు… తన మనవడు దేవాన్ష్ మీద ఒట్టేయగలరా..? అంటూ సవాల్ విసిరారు వంశీ.. గన్నవరం నుంచి లోకేష్ పోటీ చేస్తానంటే.. నేను రాజీనామా చేస్తానంటూ మరో వాదన తెరపైకి తెచ్చిన ఆయన.. వదిన పరిటాల సునీతే రాజీనామా పత్రం స్పీకరుకు పంపొచ్చు… వదిన పరిటాల సునీత వచ్చి గన్నవరం సీటును గెలిపించుకుంటారేమో చూస్తానని వ్యాఖ్యానించారు.. ఆమె కృష్ణ సారధ్యం చేస్తుందో.. శల్య సారధ్యం చేస్తుందో చూస్తానన్న ఆయన.. 2014లో కొడాలి నాని గెలిచారు ఆమె ఓడించ లేకపోయారు.. 2019లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడే కొడాలి నానిని ఓడించ లేకపోయారని.. ఇప్పుడు నన్ను ఓడించే ప్రయత్నం పరిటాల సునీతను చేయమనండి చూస్తానన్నారు. ఇక, గతంలో నేను పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పుడు కూడా పరిటాల సునీత మా కుటుంబంతో సాన్నిహిత్యంగానే ఉన్నారని గుర్తుచేసుకున్న వంశీ.. ఆమెకు ఇప్పుడే అంత కోపం ఎందుకు వచ్చింది..? అని ప్రశ్నించారు.. చంద్రబాబు మనస్సులో మాటను ఆమెతో చెప్పించారంతే.. అంటూ అనుమానాలను వ్యక్తం చేశారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.