వైకుంఠ ఏకాదశి వేళ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు.. వైష్ణవాలయాలు తెల్లవారుజామునుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలైన తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి, రెండు రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాలు సహా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది.. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు… ఈ సమయంలో వీఐపీ భక్తుల తాకిడి కూడా తిరుమలలో పెరిగింది.. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, కర్నాటక గవర్నర్ థాహర్ చంద్ గ్లేహట్, జమ్ము గవర్నర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, అంబటిరాంబాబు, విశ్వరూప్, తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, గంగుల, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, పీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి… సహా ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు.
అన్నవరం సత్యదేవుని ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.. స్వామి అమ్మవారు లను ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు.. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉత్తర ద్వార దర్శనం సమయం పొడిగించారు.. మధ్యాహ్నం 12 .30నుంచి 1.30వరకు స్వామివారికి నివేదనలు సమర్పణ ఆ సమయంలో దర్శనం నిలుపుదల చేయనున్నారు.. స్వామి వారికి పంచ హారతులు, నీరాజన మంత్రపుష్పాలు.. ఉదయం 11 గంటలకు స్వామి అమ్మవార్లకు వెండి రథంపై ప్రాకార సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు.. ఋషి కొండ టీటీడీ దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించారు. సింహాచలం దేవస్థానంలో వైకుంఠవాసుని ఉత్తర ద్వారం లో తొలి దర్శనం చేసుకున్న అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబం చేసుకుంది..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రకాశం జిల్లాలోని పలు ఆలయాలలో తెల్లవారు జాము నుంచే భక్తుల రద్దీ ఏర్పడింది.. మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు స్వామివారు. ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్న భక్తులు.. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది.. వీఐపీలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక, దేవుని కడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ దర్శనం కోసం బారులు తీరారు భక్తులు.. కడప ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, నందలూరు సౌమ్యనాధ స్వామి ఆలయాల్లో వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి పానకాల స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం… తెల్లవారుజాము నుండి భారీగా స్వామివారి దర్శనానికై బారులు తీరిన భక్తులు.. ఇక, భక్తులతో కిటకిటలాడుతుంది ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము. తెల్లవారుజామున 3 గంటల నుంచి వైకుంఠద్వార దర్శనం ప్రారంభమైంది.. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. దశావతారాలలో రెండవదైన కూర్మనాధున్ని దర్శించుకొనేందుకు క్యూ లైన్లలో వేచివున్నారు భక్తజనం.. ఇక, శ్రీకాకుళం జిల్లాలోని కలియుగ ప్రత్యక్ష దైసం అరసవల్లి శ్రీ సూర్య క్షేత్రంలోఉత్తరద్వార దర్శనం ప్రారంభించారు.. ఆమదాలవలస శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. మరోవైపు.. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఉత్తరద్వార దర్శనం ప్రారంభమైంది. భక్తులు పోటెత్తారు. తొలి దర్శనం చేసుకున్నారు శాసనసభ సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, చైర్మన్ రమేష్ రాజు దంపతులు..
నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి.. శ్రీ వేణుగోపాలస్వామి..శ్రీ వెంకటేశ్వర స్వామి… బిట్రగుంటలోని శ్రీ వెంకటేశ్వర.. వేదగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెంచలకోనలోని పెంచల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కృత్తికా నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేక పూజలు నిర్విహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం భర్తపురం గ్రామం లో గల శ్రీ కళ్యాణ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తున్నారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థంలో నేడు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది.. గిర ప్రదక్షణ ను ప్రారంభించ నున్న సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసనంద సరస్వతి.. శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి రావణ వాహనసేవ నిర్వహించనున్నారు. ఆలయ ఉత్తర భాగంలో రావణ వాహనంపై ఆశీనులను చేసి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు భక్తులు..
యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు.. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కావడంతో భక్తులు పోటెత్తారు.. ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత తదితరులు.. యాదాద్రిలో నేటి నుండి 6 రోజుల పాటు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో అద్యానోత్స్వలు శ్రీ స్వామివారి నిత్యకళ్యాణం రద్దు చేశారు. వైకుంఠ ఏకాశశి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పింది.. ఉత్తర తిరుమల, రామాలయం, జెండా బాలాజీ మందిరం లో ఉత్తర ద్వారా దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.. దోమకొండ లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి సువర్ణ కిరీటం సమర్పించారు మంత్రి హరీష్ రావు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి బంగారు కిరీటి ధారణ చేశారు.. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.. వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు సాగుతున్నాయి.. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్ఛా రణల మధ్య వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.. ఉత్తర ద్వారం గుండా స్వామి వార్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి దంపతులు దర్శించుకున్నారు.. కాళేశ్వరంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు సాగుతున్నాయి.. శ్రీ రామాలయంలో ఉత్తరద్వార దర్శనం గుండా స్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు..
మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి చేతుల మీదుగా ప్రతిష్టించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వారం దర్శనం కల్పిస్తున్నారు.. ఏక శిలా నగరం ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశి వైభవంగా సాగుతోంది. తెల్లవారుజామున నుంచేభక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. ఉదయం ఐదు గంటలకు దర్శనం కల్పిస్తూ భక్తులను అనుమతించారు. గరుడ వాహనంపై కోదండ రాముడుభక్తులకుందరహన మిచ్చారు. టిటిడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు చేశారు. కడప జిల్లా కలెక్టర్ విజయ రామరాజు దంపతులు ఒంటిమిట్ట కొందరామున్ని దర్శించు కున్నారు.