Piyush Goyal: ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. చంద్రబాబు నా పెద్దన్న.. సంస్కరణల ఆర్కిటెక్ట్ అని పేర్కొన్నారు. ఇక, ఐటీ రంగంలో చంద్రబాబు కృషి ప్రశంసనీయం.. ఈ రోజు దుర్గాష్టమి, చెడుపై మంచి విజయం సాధించిన రోజు అన్నారు. ఇక, విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 7వ సారి “భాగస్వామ్య సదస్సు” నిర్వహించబోతున్నారు. వైజాగ్ మంచి అందమైన నగరం.. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన నగరం విశాఖపట్నం.. మనందరి మంచి భవిష్యత్తు కోసమే భాగస్వామ్యం అవసరం అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Read Also: Israel: బ్రిటీష్ వారు కాదు, భారత సైనికులు మమ్మల్ని రక్షించారు.. ఇజ్రాయిల్ మేయర్..
ఇక, కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ సంస్కరణలతో వినియోగదారులకు మంచి ప్రోత్సాహం కలిగిస్తుంది అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గోయల్ చెప్పుకొచ్చారు. వసుధైక కుటుంబం అనే స్పూర్తితో భారత్ నిర్ణయాలు తీసుకుంటోంది అని తెలిపారు. కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాలు దేశ ప్రజల అభివృద్ధికి దోహదపడుతాయని పేర్కొన్నారు. చంద్రబాబు లాంటి విజనరి లీడర్ ఉంటే ఏపీ అద్భుతంగా డెవలప్‌మెంట్ అవుతుందని వెల్లడించారు.
