Site icon NTV Telugu

Nitin Gadkari : నేడు విజయవాడలో పర్యటించనున్న కేంద్రమంత్రి

నేడు విజయవాడలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్ర గడ్కరీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. నాయ్‌ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించనున్నారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజలు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించి, ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ, జగన్‌లు పాల్గొని ప్రసంగించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు బెంజ్‌ సర్కిల్‌కు కేంద్రమంత్రి గడ్కరీ, జగన్‌లు చేరుకుంటారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఫైఓవర్‌ను కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభించనున్నారు. గుడివాడలో రైల్వే గేట్లు దాటేందుకు 2.5 కిలోమీటర్ల మేర వంతెనను నిర్మించారు. గుడివాడ వంతెన నిర్మాణానికి రూ.317.22 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈ పర్యటనలో భాగంగా విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో గడ్కరీ గంటపాటు భేటీ కానున్నారు.

https://ntvtelugu.com/ips-ramgopal-naik-got-shourya-medal/
Exit mobile version