Site icon NTV Telugu

Kishan Reddy: అప్పులు చేసి ఏపీ రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారు?

క‌డ‌ప‌లో బీజేపీ రాయ‌ల‌సీమ ర‌ణ‌భేరి స‌భకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిపోయిందని.. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు.

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి స్పందించారు. సీమ అభివృద్ధి కోసం జ‌గ‌న్ ఏం చేశారో చెప్పాలన్నారు. రాయ‌ల‌సీమ‌కు ర‌త‌నాల‌సీమ అని పేరు ఉంద‌ని… అలాంటి ర‌త‌నాల సీమ ఈ రోజు వెనుక‌బ‌డిపోయింద‌ని కిషన్‌రెడ్డి తెలిపారు. సీమ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేయ‌లేద‌ని ఆయన విమర్శలు చేశారు. ఏపీలో బీజేపీలో చేరేవారిని ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాగా అంతకుముందు కడప చేరుకున్న కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శాలువా కప్పి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

మరోవైపు ఏపీ మాజీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ ఏపీలో భూముల కబ్జా పైనే వైసీపీ నేతల కన్ను ఉందని ఆరోపించారు. కేంద్రం నిధులిస్తున్నా వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో లిక్కర్, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. అనేక వనరులు ఉన్న రాయలసీమను, రాయలసీమలోని ప్రాజెక్టులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాయలసీమలో 20 లక్షల ఎకరాలకు నీరివ్వాలి కానీ 7 లక్షల ఎకరాలనే స్థిరీకరించారని ఆయన ఆరోపించారు.

https://ntvtelugu.com/nadendla-manohar-counter-to-kakinada-mla-dwarampudi-chandrasekhar-reddy/
Exit mobile version