NTV Telugu Site icon

ఆ విష‌యంలో వెన‌క్కి తగ్గేదిలేదు… కేంద్రం మ‌రోసారి స్ప‌ష్టం…

విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రించ వ‌ద్ద‌ని కార్మికులు, ఉద్యోగులు ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ‌ని ఇప్ప‌టికే కార్మికులు ప్ర‌క‌టించారు.  ఇందులో భాగంగానే విశాఖ‌లో ర్యాలీలు, నిర‌స‌న దీక్ష‌లు చేస్తున్నారు.  ఎవ‌రెన్ని చెప్పినా ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో వెనక్కి త‌గ్గేది లేదని కేంద్రం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.  ఇప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో ఇదే విష‌యాన్ని కేంద్ర ఆర్ధికశాఖ స‌హాయ‌మంత్రి ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.  ఈరోజు కూడా పార్ల‌మెంట్‌లో మ‌రోసారి స్ప‌ష్టంగా చెప్ప‌డంతో విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అనివార్య‌మ‌ని తేలిపోయింది.  విశాఖ ఉక్కును ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేసింది.  వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు పార్ల‌మెంట్ ఉభ‌యస‌భ‌ల్లో ఆందోళ‌నలు చేస్తున్నారు.  దిగిరాకుంటే ఆందోళ‌న మ‌రింత ఉధృతం చేస్తామ‌ని అంటున్నారు.  అయితే, విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రంచ‌డం వ‌ల‌న ఉక్కు ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని, ఉద్యోగావ‌కాశాలు పెరుగుతాయ‌ని కేంద్రం చెబుతున్న‌ది.  

Read: “గల్లీ రౌడీ”కి సెన్సార్ పూర్తి