Two Mothers Died While Saving Their Children In Nellore District: కేజీఎఫ్ సినిమాలోని ‘ఈ ప్రపంచంలో తల్లుల్ని మించిన యోధులు ఎవ్వరు లేరు’ అనే డైలాగ్‌కి తగ్గట్టు ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి. తమ పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఎందరో తల్లులు ఎన్నో సాహసాలు చేశారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టడానికి కూడా వెనుకాడరు. తమ ప్రాణాలు పోతాయన్నా సరే.. పిల్లల్ని రక్షించేందుకు దేనికైనా తెగిస్తారు. ఇప్పుడు ఇద్దరు తల్లులు కూడా అదే సాహసం చేశారు. తమ పిల్లల్ని రక్షించడానికి అతిపెద్ద ప్రమాదాన్ని ఎదురించేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఈ ఘటనలో ఆ తల్లులిద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Bandi Sanjay: మోడీ 9 ఏళ్ల పాలనపై జన సంపర్క్ అభియాన్ ప్రారంభం
నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ సమీపంలో గత కొంతకాలం నుంచి పెన్నానది రివిట్‌మెంట్ వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగానే అక్కడ గుంతలు తవ్వారు. అక్కడ ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు.. అనుకోకుండా గుంతలో పడ్డారు. ఇది గమనించిన ఆ పిల్లల తల్లులు షాహినా, షబీనా.. మరో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే దూకేశారు. తామూ ప్రమాదంలో చిక్కుకుంటామని తెలిసి కూడా.. లెక్క చేయకుండా తమ పిల్లల కోసం దూకారు. ఎలాగోలా తమ పిల్లల్ని కాపాడుకోగలిగారు కానీ.. ఆ తల్లులు మాత్రం బయటపడలేకపోయారు. బురదలో చిక్కుకొని, ప్రాణాలు వదిలారు. దీంతో.. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ తల్లుల్ని కళ్ల ముందే పోగొట్టుకున్న ఆ పిల్లలిద్దరు కన్నీంటిపర్యంతమయ్యారు. ‘అమ్మ, లే అమ్మ, నాతో మాట్లాడు’ అంటూ తల్లుల మృతదేహాల ముందు రోధిస్తుండటాన్ని చూస్తే.. ఎవ్వరికీ కన్నీళ్లు ఆగవు.
