NTV Telugu Site icon

వైసీపీ నేతలను వదలనంటున్న కరోనా.. మరో ఇద్దరు ఎంపీలకు పాజిటివ్…

గత రెండు సంవత్సరాలు పట్టిపీడిసున్న కరోనా మహమ్మారి మరో సరి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ ప్రభావం ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఉండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిద్ నిభందనలు కఠిన తరం చేయడమే కాకుండా. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు విధిస్తున్నాయి.

అయితే ఏపీలోనూ కరోనా ఎఫెక్ట్ చాలానే ఉంది.. ఏపీలో ప్రతిరోజూ 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అధికార వైసీపీ నేతలను సైతం కరోనా మహమ్మారి వదలనంటోంది. ఇటీవలే.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు లు కరోనా బారిన పడగా.. తాజాగా మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు కరోనా బారిన పడ్డారు. కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, ఆమెతో పాటు ఆమె పీఏ, గన్ మెన్ కు పాజిటివ్ గా తేలింది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు పాజిటీవ్ రావడంతో హోం ఐసొలేషన్ ఉన్నారు.