AP Assembly: రెండు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బోయ/వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది.. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. మరోవైపు, క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన దళితులను ఎస్సీలుగా పరిగణించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం చేసింది ఏపీ అసెంబ్లీ.. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున.. ఈ రెండు బిల్లులను కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Read Also: AP Assembly: ఐదు బిల్లులు, రెండు కీలక తీర్మానాలకు ఆమోదం..
అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ.. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం, దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేశాం.. అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం అని వెల్లడించారు.. పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని.. రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది.. ప్రభుత్వానికి నివేదిక అందించింది.. దీంతో, ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం చేశామన్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ తీర్మానం జరిగింది.. మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం.. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండబోదు అన్నారు. అయితే, గిట్టనివారు ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. మరోవైపు, దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది అసెంబ్లీ.. శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.
