NTV Telugu Site icon

AP Skill Development Scam: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక మలుపు..

Cid

Cid

AP Skill Development Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్‌, ఆయన భార్య ఐఏఎస్ అధికారి అపర్ణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్‌పై ఇవాళ బెజవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరపనుంది.. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్‌ను సీఐడీ అరెస్ట్‌ చేసింది.. అయితే, సీఐడీ కోర్టు రిమాండ్ తిరస్కరిస్తూ ఆదేశాలు ఇవ్వటంతో భాస్కర్ ను విడుదల చేశారు సీఐడీ అధికారులు.. మరోవైపు సీఐడీ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు.. ఇక, సీఐడీ కోర్టు ఇచ్చిన అదేశాలు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం.. ఏసీబీ కోర్టును ఆశ్రయించారు భాస్కర్, ఆయన భార్య అపర్ణ..

Read Also: NTR: వైఫ్ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన ఎన్టీఆర్…

కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులతో కలిసి సిమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా రూ. 3300 కోట్లకు పెంచి, ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేశారని ఆరోపణలు భాస్కర్‌పై ఉన్నాయి.. ఈ చర్యతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యవయంలో 10 శాతం చెల్లింపులలో భాగంగా అదనంగా రూ. 371 కోట్ల భారం ఏర్పడింది. కానీ, సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ధర కేవలం రూ. 58 కోట్లు అని బిల్లులు చేసి ఉంది. జీవీఎస్‌ భాస్కర్ ప్రాజెక్ట్ అంచనాలను తారుమారు చేసి రూ. 3300 కోట్లకు చేర్చాడని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది.. సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెక్నాలజీ అందిస్తున్న పార్ట్ నర్ ఈ ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం వాటాను అందించాలని భావించారు. కానీ, భాస్కర్ మరికొందరు నిందితులు అప్పటి ప్రభుత్వ అధికారులతో కలిసి, అవగాహన ఒప్పందాన్ని తారుమారు చేయడానికి కుట్ర చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.