NTV Telugu Site icon

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌కు సక్సెస్ ఫుల్‌‌గా గేట్లు అమరిక.. ఆగిన నీటి వృథా

Tungabhadradam

Tungabhadradam

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు విజయవంతమైంది. విరిగిపోయిన గేటు దగ్గర మూడో ఎలిమెంట్‌ను అమర్చారు. ఇప్పటి వరకు 3 ఎలిమెంట్‌లను విజయవంతంగా సాంకేతిక నిపుణుల బృందం పూర్తి చేసింది. దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.

ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్‌గా 4 బ్లాకుల స్టాప్ లాగ్‌లను అమర్చారు. కాసేపట్లో 5వ స్టాప్ లాగ్ బ్లాక్‌ను కూడా అమర్చనున్నారు. నిన్న మొదటి స్టాప్ లాగ్ ఎలిమెంట్ అమర్చడంతో అధికారుల్లో మనోధైర్యం పెరిగింది. 19వ గేటు కొట్టుకుపోవడంతో నీరు వృథా కాకుండా స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు చేయాలని నిపుణులు భావించారు. వరద ఉధృతి కారణంగా కొత్త గేటు ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవడంతో 5 స్టాప్ లాగ్ ఎలిమెంట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 4 అడుగుల ఎత్తు 60 అడుగుల వేడేల్పు చొప్పున 5 స్టాప్ లాగ్ బ్లాకులు ఏర్పాటు చేశారు. ప్రస్తుత తుంగభధ్ర ఔట్ ఫ్లో 14 వేల క్యూసెక్కులు ఉంది.