Site icon NTV Telugu

TTD : భక్తులకు టీటీడీ శుభవార్త..

Ttd

Ttd

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇప్పటికే డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది.. కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు భక్తులు… డిసెంబరు నెల టికెట్ల కోటాను అక్టోబరులోనే విడుదల చేయాల్సి ఉండగా.. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని డిసెంబర్‌ నెల నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయానికి రావడంతో స్లాట్ల సర్దుబాటులో భాగంగా జాప్యం జరిగింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా 5,06,600 టికెట్లను వివిధ స్లాట్లలో విడుదల చేయడం.. హాట్‌ కేకుల్లా అయిపోవడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది..

Read Also: Koti Deepotsavam LIVE : శ్రీశైలం శ్రీ మల్లికార్జున కల్యాణం

మరోవైపు.. ఎల్లుండి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఎల్లుండి ఉదయం అంటే ఈ నెల 16వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. డిసెంబర్ మాసానికి సంబంధించిన వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్టు టీటీడీ పేర్కొంది.. ఇక, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా మరియు దర్శన టికెట్లను కూడా విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది..

Exit mobile version