Site icon NTV Telugu

TTD Srivari Hundi: కొత్త రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ ఆదాయం

Ttd Srivari Hundi

Ttd Srivari Hundi

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది.. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో పాటు.. హుండీలో కాసుల వర్షం కురిస్తోంది.. తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఇవాళ ఏకంగా శ్రీవారి హుండి ఆదాయం 6.18 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.. మొట్టమొదటిసారి 6 కోట్ల మార్క్‌ను దాటింది స్వామివారి హుండీ ఆదాయం.. ఇప్పటి వరకు 2012 ఏప్రిల్‌ 1వ తేదీన లభించిన రూ.5.73 కోట్ల ఆదాయమే అత్యధికం కాగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది శ్రీవారి హుండీ ఆదాయం.. అయితే, కోవిడ్‌ కారణంగా ఆంక్షలతో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం భారీగా తగ్గిపోగా.. తిరుమలలో క్రమంగా ఆంక్షల ఎత్తివేయడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఇదే సమయంలో.. శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగి.. కొత్త రికార్డు సృష్టించింది.

Read Also: Corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్‌లోనే 247 కొత్త కేసులు

Exit mobile version