NTV Telugu Site icon

ఆ వార్తలు నిజం కాదు : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని.. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ సోషల్‌మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ స్పందించింది. టీటీడీ ఉద్యోగాలంటూ సోషల్‌మీడియాల ప్రకటనలు నమ్మొద్దని స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఇలా అవాస్తవ ప్రకటనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఉద్యోగ ప్రకనపై పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతామని, ఇలాంటి వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కోరింది.