Site icon NTV Telugu

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : ఎన్‌వీ రమణకు 21 పేజీల లేఖ!

CJI NV Ramana

CJI NV Ramana

తిరుమల పర్యటనలో బిజీగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణకు 21 పేజిల విజ్ఞప్తి లేఖను టిటిడి బోర్డు సభ్యుడు శివకుమార్ అందజేశారు. సుప్రింకోర్టు సుమోటోగా తీసుకోని…. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని లేఖలో శివకుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలోనే టిటిడి పాలకమండలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన అంశాన్ని కూడా బోర్డు సభ్యుడు శివకుమార్ ప్రస్తావించారు. తెలుగు వ్యక్తిగా తమ డిమాండ్ ను నెరవేర్చాలని కూడా లేఖలో పేర్కొన్నారు.

కాగా.. ఇవాళ ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు.. స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి స్వాగతం పలికారు. రేపు మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు.

Exit mobile version