NTV Telugu Site icon

TTD Mobile App: టీటీడీకి కొత్త యాప్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సేవలు

Ttd Mobile App

Ttd Mobile App

TTD Mobile App: సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. 20 కోట్ల రూపాయల వ్యయంతో జియో సహకారంతో యాప్‌ను రూపొందించింది టీటీడీ.. యాప్ ఏర్పాటుకు అయిన వ్యయాని టీటీడీకి జియో సంస్థ ఉచితంగా అందించింది.. ఇవాళ ఆ కొత్త యాప్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు.. తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వున్న భక్తులు టీటీడీ సేవలు పొందవచ్చు అని తెలిపారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీకి సంబంధించిన వన్ స్టాప్ విధానంలో భక్తులు యాప్ ద్వారా సేవలు పొందవచ్చునని.. వర్చువల్ సేవలను భక్తులు యాప్ ద్వారా విక్షించవచ్చు అని.. యాప్ ద్వారా భక్తులు టీటీడీకి విరాళాలు కూడా అందిచవచ్చు అని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.. ఇక, శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయానికి బంగారు తాపడం పనుల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు రెండు సంవత్సరాలైనా ఇంకా పూర్తి కాలేదన్నారు. శ్రీవారి ఆలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పనులు వేగవంతంగా నిర్వహించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని భావిస్తూన్నామన్నారు. ఆరు నెలల కాల పరిధిలో టెండర్ల ప్రకియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మరోవైపు.. రథసప్తమికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి.

Read ALso: Traffic Police: సిగ్నల్ క్రాస్ చేస్తున్నారా? అయితే జాగ్రత.. 24గంటలు నిఘా..

కాగా, తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.. రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు.. రథసప్తమి సందర్భంగా రేపు సర్వదర్శనం భక్తులుకు జారీచేసే టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఇవాళ, రేపు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపును కూడా రద్దు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు..

Show comments