NTV Telugu Site icon

సంప్రదాయ భోజనం పై వెనక్కి తగ్గిన టీటీడీ…

సంప్రదాయ భోజనం పై వెనక్కి తగ్గింది టీటీడీ. డబ్బులు తీసుకొని భోజనం పెట్టాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు రావడంతో సంప్రదాయ భోజన పథకాని నిలిపివేస్తునట్లు ప్రకటించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పాలకమండలి లేని సమయంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ఏ కార్యక్రమం నిర్వహించిన స్వామి వారీ ప్రసాదంగానే పెట్టాలి… డబ్బులు వసూలు చెయ్యకూడదు అని తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్వదర్శనం ప్రారంభాన్ని వాయిదా వేశాం.. జిల్లా అధికారులు ఇచ్చే నివేదిక మేరకు సర్వదర్శనం ప్రారంభం పై నిర్ణయం తీసుకుంటాం. కొంత సంఖ్యలోనైనా భక్తులను సర్వదర్శనానికి అనుమతించేందుకు ప్రయత్నిస్తాం అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Show comments