Site icon NTV Telugu

మరో వివాదంలో టీటీడీ..!

TTD

TTD

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలోని 177 కల్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది.. 5 సంవత్సరాల కాలపరిమితితో లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది టీటీడీ.. అయితే, ఓ వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ… మరో వైపు నిర్మించిన కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వడంపై అభ్యంతరాలు ఇవ్యక్తం అవుతున్నాయి.. కల్యాణ మండపాల నిర్మాణం పై నిర్ధిష్టమైన విధానం తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version