NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి హుండీ ఆదాయం మరో రికార్డు..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం మరో రికార్డు సృష్టించింది… కరోనా మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు.. హుండీ ఆదాయం కూడా తగ్గిపోయిన విషయం తెలిసిందే కాగా.. మళ్లీ అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో.. ఇప్పుడు క్రమంగా భక్తుల సంఖ్యతో పాటు.. హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది… ఈ నేపథ్యంలో… శుక్రవారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది..

Read Also: Russia-Ukraine conflict: వేయి మందికి పైగా రష్యా సైనికులు మృతి..!

నిన్న మొత్తంగా శ్రీవారిని 56,559 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 28,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇదే సమయంలో.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.41 కోట్లుగా ప్రకటించారు అధికారులు.. అంతేకాదు.. శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు.. 2012 ఏప్రిల్‌ 1వ తేదీన శ్రీవారికి అత్యధికంగా రూ. 5.73 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.. ఇదే, శ్రీవారి హుండీ ఆదాయం అత్యధిక రికార్డుగా ఉంది.. అయితే, ఆ తర్వాత అత్యధిక హుండీ ఆదాయం నిన్నటి (శుక్రవారం) రోజున సమర్పించారు భక్తులు.