NTV Telugu Site icon

అమరావతి రాజధాని రైతులకు టీటీడీ గుడ్ న్యూస్

అమరావతి రాజధాని రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను అందించింది. రైతులు పెద్దసంఖ్యలో ఒకేసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతి జారీ చేసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ బుధవారం ఉదయం 500 మంది రైతులు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చని సూచించింది.

Read Also: అయ్యప్ప భక్తులకు శుభవార్త… తెలంగాణ నుంచి శబరిమలకు 200 బస్సులు

కాగా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో 44 రోజుల పాటు పాదయాత్ర చేశారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభించిన రైతుల పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగింది. మొత్తం 400 కి.మీ.కి పైగా రైతులు పాదయాత్ర పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం అలిపిరి వద్ద రైతుల పాదయాత్ర ముగియనుంది. రేపు రైతులంతా శ్రీవారిని దర్శించుకోనున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని వారు కలియుగ దైవాన్ని ప్రార్థించనున్నారు. మరోవైపు ఈ నెల 17న తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సభకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే వీరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.