NTV Telugu Site icon

టీటీడీ డైరీ, క్యాలెండర్ల పేరిట కేటుగాళ్ళ దందా

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల రాక పెరిగింది. టీటీడీ ఏటా ప్రచురించే క్యాలెండర్లు, డైరీలకు మంచి డిమాండ్ వుంటుంది. తిరుమలతో పాటు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లోని టీటీడీ దేవాలయాల్లో వీటిని విక్రయిస్తుంటారు. ఎంతో నాణ్యతతో మూర్తీభవించిన స్వామివారి క్యాలెండర్లను తమ ఇంటిలో, కార్యాలయాల్లో ఉంచుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అయితే కొందరు కేటుగాళ్ళు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్లో అధిక ధరలకు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారు.

ఆన్‌ లైన్ లో టీటీడీ క్యాలండర్స్,డైరీల‌ పేరుతో క్యాష్ చేసుకుంటున్న కొందరు కేటుగాళ్ళు గుట్టు రట్టయింది. అమెజాన్ వాళ్ళ‌కి‌ మాత్రమే ఆన్‌లైన్ లో టీటీడీ‌ క్యాలెండర్స్, డైరీల విక్రయాలకు అనుమతి ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే రాజమండ్రికి చేందిన మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు గూగుల్ క్రోమ్లో దేవుళ్ళు డాట్ కామ్ పేరుతో టీటీడీ డైరీలు,క్యాలెండర్స్ ను విక్రయిస్తున్నారు.

ఈ నెల 20వ తేదీ నుండి ఆన్లైన్ లో విక్రయిస్తోంది మోహన్ పబ్లికేషన్స్. టీటీడీకి చెందిన రూ 130 విలువైన క్యాలండర్ ను 243 రూపాయలకు,150 విలువ చేసే డైరీలను 247 రూపాయలకు విక్రయిస్తున్నారు. మోహన్ పబ్లికేషన్స్ అమ్మకాలపై టీటీడీ విజిలెన్స్ తో విచారణకు ఆదేశించారు అధికారులు.