NTV Telugu Site icon

రేపటి నుండి రెండు నెలలు అలిపిరి నడకమార్గం మూసివేత..

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13085 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5182 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 82 లక్షలు. అయితే రేపటి నుంచి రెండు నెలలు పాటు అలిపిరి నడకమార్గం మూసివేశారు టీటీడీ అధికారులు జూన్ 1 నుంచి జూలై 31వరకు మరమత్తు పనులు కారణంగా ఈ మార్గం ముసేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాని వినియోగించు కోవాలని సూచించింది టీటీడీ.