Site icon NTV Telugu

CM Camp Office: సీఎం జగన్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి

Yv Subba Reddy

Yv Subba Reddy

అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 నుంచి భువనేశ్వర్‌లో నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వివరించారు.

ఈనెల 26న భువనేశ్వర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయని సీఎం జగన్‌కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి కూడా ఉన్నారు. కాగా అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం, నెల్లూరు జిల్లాలోని సంగం సహా పలు ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం జగన్ సమీక్షిస్తున్నారు.

Atchannaidu: నారాయణ అరెస్ట్ అక్రమం

Exit mobile version