NTV Telugu Site icon

TTD: తోపులాటపై స్పందించిన టీటీడీ చైర్మన్‌.. దేవుడిపై రాజకీయాలా..?

YV Subba Reddy

YV Subba Reddy

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ దగ్గర తోపులాట కలకలం రేపింది.. పెద్ద ఎత్తున భక్తుల తరలిరావడం.. ఒక్కసారిగా అంతా ఎగబడడంతో తోపులాట జరిగింది.. అయితే, మూడు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ఈ తోపులాటపై స్పందించారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. ప్రతిపక్షాలు దేవున్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాయని మండిపడ్డారు.. సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో కొంత మేరకు తోపులాట జరిగినా దేవుడి దయవల్ల ఎవరికీ ప్రాణా పాయం జరగలేదన్న ఆయన.. ఈ సంఘటన జరిగిన గంటలోపే టోకెన్లు లేకుండానే భక్తులను తిరుమలకు అనుమతించామని గుర్తు చేశారు.

Read Also: Nara Lokesh: ‘అమ్మ ఒడి’పై లోకేష్‌ సెటైర్లు.. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి..!

ఇక, ఆ ఘటన పై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులు, భక్తుల్లో భయాందోళనలు కల్పించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. దేవుడు అన్నీ చూస్తున్నారని, భక్తులు ఇలాంటి వాటిని నమ్మే పరిస్థితి లేదన్న ఆయన.. టీడీపీ పాలనలో తిరుమలలో ఇలాంటి సంఘటనలు జరగలేదా ? భక్తులు కంపార్ట్‌మెంట్ల గేట్లు విరిచిన సంఘటనలు గుర్తు లేవా..? అని ప్రశ్‌నించారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం చేయిస్తుంటే, స్వామివారిని భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆరోపణలు చేయడం దురదృష్టకరం అన్నారు.. తిరుమలలో క్యూ లైన్లలో ఉండే భక్తులకు పాలు, ఆహారం, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.