NTV Telugu Site icon

ఈనెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం…

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13516 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5227 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 51 లక్షలు. అయితే ఈనెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ప్రస్తుత పాలకమండలి గడువు 21న ముగియనుంది. అయితే పాలకమండలి నియామక సమయంలో నిర్దిష్ట కాలపరిమితి విధించకపోవడంతో…. తదుపరి పాలకమండలి నియామకం జరిగే వరకు ప్రస్తుత పాలకమండలి కోనసాగే వెసులుబాటు ఉంది.