విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు.
★ బెంజిసర్కిల్ వైపు నుంచి ఎంజీ రోడ్డు వైపు వచ్చే వాహనాలను బెంజి సర్కిల్, స్క్రూ బ్రిడ్జి, కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా బస్ స్టేషన్ వైపు మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ కూడలి, శిఖామణి కూడలి నుంచి వెటర్నరీ కూడలి వైపు ఏ విధమైన వాహనాలను మళ్లించరు. బెంజిసర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా కూడలి వరకు వీఐపీల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
★ పాత కంట్రోల్ రూం నుంచి బెంజి సర్కిల్ వైపు వచ్చే అన్ని వాహనాలను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఆర్టీసీ వై జంక్షన్, కార్ల్ మార్క్స్ రోడ్డు, విజయా టాకీస్, చుట్టుగుంట, పడవల రేవు, రామవరప్పాడు మీదుగా మళ్లిస్తారు. అటు ఆర్టీసీ వై జంక్షన్, బందరు లాకులు, రాఘవయ్య పార్కు, కృష్ణలంక హైవే స్క్రూ బ్రిడ్జి మీదుగా వాహనాలను మళ్లిస్తారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!