NTV Telugu Site icon

విశాఖలో ఓ బెట్టింగ్‌ నిర్వాహకుడి అరెస్ట్…

టీ-20 వరల్డ్‌ కప్‌లో భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ నెలకొంది. మరోవైపు… ఈ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్స్‌ జరుగుతున్నాయి. విశాఖలో ఓ బెట్టింగ్‌ నిర్వాహకుడ్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో రైడ్‌ చేసిన పోలీసులు … బెట్టింగ్‌ నిర్వాహకుడు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్‌టాప్‌, రెండు మొబైల్‌ ఫోన్లు, రెండు బ్యాంకు చెక్‌బుక్స్‌, ఎటిఎం కార్డులతో పాటు 88 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ప్రభాకర్‌ వెనుక ఇంకొంత మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఈ మ్యాచ్ పై తిరుపతి కేంద్రంగా కూడా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జోరుగా ఆన్‌లైన్‌, ఆఫ్లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాయి కొన్ని ముఠాలు. హోటళ్లు, లాడ్జిల్లో తిష్టవేసిన ముఠాలు… బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి.

ఇండియా,పాక్ మ్యాచ్ పై రెచ్చిపోతున్న బెట్టింగ్ బంగార్రాజులు | Betting Updates From Tirupati | NTV