పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. శ్రీశైలంలో నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన కళ్యాణకట్ట సిబ్బంది తీరు విమర్శలకు కారణం అవుతోంది. ఆలయం కేశఖండనశాలలో భక్తులు తలనీలాలు ఇస్తుంటారు.
అక్కడ చేతివాటం చూపించారు 12 మంది క్షురకులు. దేవస్థానం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను పరిశీలించిన ఈవో లవన్న ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. చేతివాటానికి పాల్పడిన 12 మంది క్షురకులను విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఈవో లవన్న. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.