NTV Telugu Site icon

Tomato Price Falls Down: దారుణంగా పతనమైన టమోటా ధర..

Tomato Price

Tomato Price

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి.. అయితే, అంతకు ముందు.. సెంచరీ దాటిన టమోటా ధర మాత్రం క్రమంగా కిందకు దిగివచ్చింది.. వర్షాల కంటే ముందే.. హైదరాబాద్‌ మార్కెట్‌లో అయితే.. 80.. 60.. 50.. ఇలా రిటైల్‌ మార్కెట్‌లో ఇప్పుడు కిలో రూ.20 వరకు పలుకుతుంది. ఇక, అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరున్న ఏపీలో టమాటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.. మొదటి రకం టమోటా ధర కిలోకి రూ.5కి పతనమైంది.. ఇక, మూడవ రకం టమోటా అయితే 2 లేదా 3 రూపాయలు పలకని పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కనీసం ట్రాన్స్ పోర్డు ఖర్చులకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Read Also: Godavari floods: భద్రాచలంలో మళ్ళీ పెరిగిన గోదావరి.. 45 అడుగులకు వరద నీరు

కాగా, మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు సహా కర్ణాటకకు కూడా టమోటాను ఎగుమతి చేస్తుంటారు.. నాణ్యమైన టమాటా నిన్న మొన్నటి వరకు రూ.10 పైగానే పలికిందని.. ఇప్పుడు దారుణంగా పతనమైంది.. ఓవైపు వర్షాలతో పంటకు నష్టం జరుగుతుంటే.. మరోవైపు.. మిగిలిన పంటకు అంతంత మాత్రం రైతన్నను కన్నీరు పెట్టిస్తోంది.