కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా వడ్డింపుల పర్వానికి తెరలేపాయి.. ఇప్పటికే ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కాగా… ఓవైపు పెట్రో ధరల పెంపుతో సతమతం అవుతున్న వాహనదారులకు మరో దిమ్మ తిరిగే షాక్ తగులనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి టోల్ ట్యాక్స్ అనుసరిస్తూ భారత జాతీయ రహదారుల సంస్థ టోల్ ప్లాజాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. తేలికపాటి వాహనాల సింగిల్ జర్నీ కి టోల్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న రోడ్డు దూరము, సదుపాయాలను బట్టి.. 5 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వడ్డించింది.. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ టోల్ ట్యాక్స్ పెరిగిపోనుంది.
Read Also: Rahul Gandhi: పెట్రో ధరలపై రాహుల్ సెటైర్లు.. పెంపు ప్రధాని దినచర్యలో భాగమైంది..!
కిలో మీటర్‌కు 13 పైసలు చొప్పున పెంచనున్నారు.. ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయి.. కొత్త రేట్ల ప్రకారం కిలో మీటర్స్, వాహనాన్ని బట్టి 5 రూపాయలు 50 రూపాయల వరకు అదనపు భారం పడబోతోంది.. ఏపీ వ్యాప్తంగా 56 టోల్ ప్లాజాలు ఉన్నాయి.. కొత్త రేట్ల ప్రకారం రోజుకు 6.6 కోట్ల వరకు టోల్ ట్యాక్స్ వసూలు అవుతుందనే అంచనాలున్నాయి.. కిలో మీటర్‌పై ఇప్పటి వరకు ఉన్న రేట్లు, ఇకపై పెరగనున్న రేట్లును ఓసారి పరిశీలిస్తే.. కారుపై రూ.1.24 నుండి రూ. 1.36కు పెరనుండగా.. మినీ బస్సు, 2 యాక్సిల్‌పై రూ.2 నుంచి రూ.2.20కు, ట్రక్, బస్సులపై రూ.4.18 నుండి రూ.4.61కి, త్రీ యాక్సిల్ పై రూ.4.56 నుండి రూ.5.03 వడ్డించ నున్నారు.. 4 టూ సిక్స్ యాక్సిల్ పై రూ. 6.56 నుండి రూ.7.22 వరకు పెరగనుండగా.. 7 అంత కంటే ఎక్కువ యాక్సిల్ పై రూ. 7.98 నుండి రూ.8.79కు పెరనుంది.. మరో రెండో రోజుల్లో కొత్త ధరలను వసూలు చేయనున్నారు.
