*ఇవాళ అవనిగడ్డలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన
* ఏపీలో మూడవ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర… ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫాం నుంచి రాహుల్ జోడో యాత్ర ప్రారంభం.. ముగతి గ్రామం వరకు సాగనున్న పాదయాత్ర.. లంచ్ బ్రేక్ తర్వాత నాలుగు గంటలకు హాలహర్వి నుంచి తిరిగి ప్రారంభం కానున్న పాదయాత్ర.. 6:30 గంటలకు కల్లుదేవకుంట గ్రామంలో కార్నర్ మీటింగ్.. రాత్రి మంత్రాలయం మండలం చెట్నిహళ్లి లో బస.. సాయంత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోనున్న రాహుల్ గాంధీ
*విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాల రాయుడు పేట వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నేడు రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమం
*నేడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో సంజీవని ఉచిత ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నారా లోకేష్
*తిరుపతి జిల్లా శ్రీహరికోటలో GSLV మార్క్ -3 రాకెట్ ప్రయోగానికి రిహార్సల్స్ చేసిన శాస్త్రవేత్తలు.. రేపు రాకెట్ సన్నద్ధతా సమావేశం.. రేపు శ్రీహరికోటకు చేరుకోనున్న ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్
*విజయవాడలో నేటి నుంచి వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
*గుంటూరు సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్న ఎల్వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు
*నరసాపురంలో ఈ నెల 27న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన..చినమైనవానిలంకలో కోస్టల్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.
* కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా
*కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కేశవరం నుంచి ప్రారంభం కానున్న 39వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర.. కేశవరం నుండి అనపర్తి మీదుగా రామవరం వరకూ నేటి పాదయాత్ర
*విజయనగరం జిల్లాకు రానున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష
