Today Events February 24, 2023
* విజయనగరంలో నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్ నేడు ఎన్నికల ప్రచారం..పాల్గోనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
*రేపు శ్రీశైలం రానున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం రానున్న చీఫ్ జస్టిస్
*ఈరోజు, రేపు తణుకు, భీమవరంలో జనసేన పిఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ పర్యటన..తణుకులో క్రియాశీలక సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం
*నేటి నుంచి ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు. మార్చి 1న రథోత్సవం
*ఏలూరులో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన..జోన్-2 పరిధిలోని నాయకులకు వర్క్ షాప్ నిర్వాహణ.. ఉభయగోదావరిజిల్లాలోని 34 నియోజకవర్గాలకు చెందిన 2500 మంది క్టస్టర్ ఇంచార్జీలు హాజరు..ఏలూరు హైవే సమీపంలో భారీ సభాప్రాంగణం ఏర్పాటు..ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సు
*ప్రవాస యోజన పర్యటనలో భాగంగా ఇవాళ కృష్ణా జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్
*ఇవాళ యాదగిరిగుట్టకు రానున్న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్…ఉదయం స్వామివారిని దర్శించుకుని ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల అలంకార సేవలో పాల్గొననున్న గవర్నర్
*నేడు రెండో రోజు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
*మార్చి 3,4 తేదీలలో వైజాగ్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో భాగంగా హైదరాబాద్ లో ఏపీ మంత్రుల ప్రెస్ మీట్.. మధ్యాహ్నం మీడియాతో మాట్లాడ నున్న మంత్రులు బుగ్గన, అమర్నాథ్
