Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

Today Events Februrary 06, 2023

* ఇవాళ తెలంగాణ బడ్జెట్. అసెంబ్లీలో హరీష్ రావు, 10.30 కి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు.. ఈసారి మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ఛాన్స్.. మండలిలో బడ్జెట్ పెట్టనున్న శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి

* ఉదయం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో పూజలు చేయనున్న ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు.

*ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తీర్పు..ఉదయం పదిన్నరకు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు డివిజన్ బెంచ్

* 5వ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..అదానీ షేర్ల పతనం, హిండేన్ బర్గ్ నివేదిక పై పార్లమెంట్ లో చర్చకు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు

* పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర..హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర..మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

*విశాఖకు రానున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్….నేషనల్ ఉమెన్ కమిషన్ నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో పాల్గోనున్న మంత్రి

*విశాఖలో మూడు రోజుల పర్యటన కోసం నేడు నగరానికి రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు…జాతీయ మహిళా కమిషన్ నిర్వహిస్తున్న సమావేశం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు

*పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

*రైతుల కోసం గుంటూరు మిర్చియార్దులో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్న యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం

*బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మేరుగ నాగార్జున

*నేడు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆర్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-5 ప్రారంభం…టోర్నమెంట్ ను ప్రారంభించనున్న సినీ నటుడు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలీ

*నేడు తునిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

*నేడు రామచంద్రపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్

Exit mobile version