టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడిపై మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైందవ పరిరక్షణ కోసం వేదపారాయణదారుల అవసరం ఎంతో ఉందని గుర్తుచేశారు. తన హయాంలో పాలకమండలి చైర్మన్‌గా ఉన్నపుడు 700 పోస్టులను ఇచ్చినట్లు జ్ఞాపకం చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు రిలీఫ్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..!
మరో 700 మంది వేదపారాయణదారులను టీటీడీ తీసుకుంటే ఎంతో మేలు జరిగేదని.. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఈరోజు ప్రారంభం కావాల్సి ఉండంగా ఉద్దేశపూర్వకంగానే టీటీడీ ఛైర్మన్ ఆపేశారని ఆరోపించారు. ప్రతిభావంతుడైన గోవిందరాజన్‌ను పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూలను ఆపేశారని తెలిపారు. ఇలా ఇంటర్వ్యూలు ఆపేయడం అభ్యంతరకర విషయం అన్నారు. నచ్చినవాళ్లను వేదపారాయణదారులుగా తీసుకోవాలన్న కుట్ర తప్ప.. ఇందులో మరేమీలేదన్నారు. ఇందుకోసం గోవిందరాజన్‌ను తప్పించడం చాలా తప్పిదం అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Sreeleela : ఫ్యాన్ బాధను తీరుస్తూ ..హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై
