Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clash Between Punganur TDP Activits: పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ నియామక అంశం తిరుపతిలో ఉద్రిక్తతలకు దారితీసింది. హోటల్ గ్రాండ్ రీచ్‌లో ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశానికి ముందే రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఇన్ఛార్జ్ చల్లా బాబు వర్గం, ఇతర స్థానిక నేతల అనుచరుల మధ్య జరిగిన తోపులాటలో కొందరు గాయపడ్డారు. ఘటనను చిత్రీకరిస్తున్న వారిపై కొందరు కార్యకర్తలు దాడికి యత్నించినట్లు సమాచారం. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమావేశాన్ని రద్దు చేసి, ఇతర నాయకులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆయన ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తను పరామర్శించారు.
ఇదిలా ఉండగా, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకంపై అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని, బలప్రదర్శనలకు తావులేదని నేతలు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వారు పిలుపునిచ్చారు. అయితే, పుంగనూరు టీడీపీలో వర్గపోరు.. తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. ఇన్ఛార్జ్ నియామకంపై టీడీపీ సమావేశం ఆరంభంలోనే ఇరు వర్గాలు కొట్టుకోవంతో.. మధ్యలోనే సమావేశం రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం చర్చగా మారింది..
Also Read
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్‌కు నివాళి.. మావిగన్‌పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!